ఖానాపూర్: బీజేపీ పటిష్టతకు అందరూ కలిసి పనిచేయాలి

63చూసినవారు
ఖానాపూర్: బీజేపీ పటిష్టతకు అందరూ కలిసి పనిచేయాలి
బీజేపీ పటిష్టతకు అందరూ కలిసి పనిచేయాలని బీజేపీ ఖానాపూర్ మండల అధ్యక్షులు పుప్పాల ఉపేందర్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వికసిత భారత్ అమృత కాలం, యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల గురించి మంగళవారం ఖానాపూర్ మండలంలోని కొత్తతర్లపాడ్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలపాలని ఆయన సూచించారు. అలాగే యోగా దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్