భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంతో పాటు జన్నారం మండలంలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. భారీ వర్షాలతో నది, వాగులు, వంకలలో వరద నీరు ప్రవహించే అవకాశం ఉంటుందని, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్ళవద్దని ఎమ్మెల్యే సూచించారు.