ఖానాపూర్: త్యాగధనుల మాసం మొహరం: ఎమ్మెల్యే
మొహరం మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండడమే కాకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం పేర్కొన్నారు. మండలంలోని సింగపూర్ లో పీరీల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నైవేద్యాలను సమర్పించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే వాటిలో మొహరంకు కూడా మహోన్నతమైన స్థానం ఉందన్నారు. ఇందులో పలువురు నాయకులు ఉన్నారు.