ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఖానాపూర్ పట్టణ 33/11 కెవి, ఖానాపూర్, సుర్జాపూర్, కడెం, బెల్లాల్ సబ్స్టేషన్లు, లైన్ల మరమ్మతులు, ఫీడర్ పై చెట్ల కొమ్మలను తొలగించడం జరుగుతుందన్నారు. దీంతో శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని వారు కోరారు.