చిన్నారులకు మంచి భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాలతోనేనని ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ నాగలక్ష్మి అన్నారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన 'అమ్మ మాట- అంగన్వాడి బాట' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి ఆమె ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శైలజ, అంగన్వాడీ టీచర్లు మమత, మానస, చందు రాణి, తదితరులు పాల్గొన్నారు.