సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి కుమ్మరి సిద్ధప్ప

66చూసినవారు
సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి కుమ్మరి సిద్ధప్ప
సిద్ధప్ప వరకవి జయంతోత్సవం
జన్నారం పట్టణంలో కుమ్మరి సిద్ధప్ప వరకవి జయంతోత్సవాన్ని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలో వారు కుమ్మరి సిద్ధప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చదువు రాకపోయిన కవి సిద్ధప్ప తన కవిత్వంతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చారని వారన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహ, కోడూరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్