ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడిపి నడపాలని అధికారులు, పోలీసులు సూచించారు. సోమవారం రాత్రి ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి-సత్తెనపల్లి మార్గం మధ్యలో వీచిన ఈదురు గాలులకు ఆటోపై చెట్టు కొమ్మ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.