లక్షెట్టిపేట: రెట్టింపైన విద్యార్థుల సంఖ్య

3చూసినవారు
లక్షెట్టిపేట: రెట్టింపైన విద్యార్థుల సంఖ్య
లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కళాశాలలో కేవలం 169 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారన్నారు. ఇటీవల నూతన కళాశాల భవనం ప్రారంభం, మౌలిక సౌకర్యాలు మెరుగు కావడంతో ఈ సంవత్సరం 330 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్