లక్షెటిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను జూన్ 12న ప్రారంభించనున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంగళవారం ఆయన ఆయా భవనాలను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. భవనాల ప్రారంభోత్సవానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా రావాలని ఆయన కోరారు. తాను చదువుకున్న పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.