లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో అన్ని పాఠశాలలను, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దగ్గర ఉండి శుభ్రం చేయిస్తున్నారు. అలాగే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు.