కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, మంగళవారం ఉదయం ప్రాజెక్టులో 675 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 46 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మొత్తం 68 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.