ఖానాపూర్ లో మహా జాబ్ మేళా

2చూసినవారు
ఖానాపూర్ లో మహా జాబ్ మేళా
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని బిఆర్ఎస్ యూత్ జన్నారం మండల నాయకులు రాగుల వెంకటేశ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ జూలై 12న ఖానాపూర్ ఏఎంకె గార్డెన్స్ లో మహా జాబ్ మేళా ఉంటుందన్నారు. ఇందులో సుమారుగా 60 కి పైగా ప్రముఖ కంపెనీలు వచ్చి నియామకాలను చేపడతాయని ఆయన వెల్లడించారు. రిజిస్ట్రేషన్ లింక్: [https: //forms. gle/yq3vD2uczox9jf3U9] ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్