దండేపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా మల్లికార్జున్

69చూసినవారు
దండేపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా మల్లికార్జున్
దండేపల్లి మండల లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా మాదంశెట్టి మల్లికార్జున్ నియమితులయ్యారు. శనివారం ఉదయం దండేపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ నూతన శాఖను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా కొండు జనార్ధన్, కోశాధికారిగా కర్నే నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్