ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కు చెందిన బి. గంగాధర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ఎస్సై లింబాద్రి తెలిపారు. గంగాధర్ అప్పుల బాధ భరించలేక బుధవారం రాత్రి 7: 30 గంటల సమయంలో తన షాపులో యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నిర్మల్, అటు నుండి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.