ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. నియోజకవర్గంలోని జన్నారం, తదితర మండలాల్లో గురువారం రాత్రి పదిన్నర గంటలకు మోస్తారు జల్లులు పడ్డాయి. దీంతో వాతావరణం కొంత చల్లబడింది. అలాగే చాలా మండలాల్లో పొడి వాతావరణమే ఉంది. రాబోయే మూడు రోజులపాటు ఒకటి రెండు మండలాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టంగా చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.