ఎంపీటీసీ సేవలు అభినందనీయం

69చూసినవారు
ఎంపీటీసీ సేవలు అభినందనీయం
జన్నారం మండలంలోని పోన్కల్ ఎంపిటిసి హరిణి మధుసూదన్ రావు సేవలు అభినందనీయమని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వి. రఘునాథ్ రావు అన్నారు. ఎంపీటీసీ హరిణి మధుసూదన్ రావు పదవీకాలం ముగియడంతో బుధవారం జన్నారం పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఎంపీటీసీ దంపతులను ఆయన శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, బీజేవైఎం అధ్యక్షులు ముడుగు ప్రవీణ్, గోలి చందు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్