ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ మృతిపై ఖానాపూర్ నియోజకవర్గంలో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలు కన్నీరుగా విలపిస్తున్నారు. రమేష్ రాథోడ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఖానాపూర్ నియోజకవర్గానికి, ఆదిలాబాద్ ఎంపీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆయన సుపరిచితులు. రమేష్ రాథోడ్ పార్దివదేహాన్ని ఆయన బంధువులు ప్రజాప్రతినిధులు ప్రజలు సందర్శిస్తున్నారు.