గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి: కౌన్సిలర్

60చూసినవారు
గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి: కౌన్సిలర్
గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ కోరారు. గురువారం మధ్యాహ్నం శ్రీరామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో కౌన్సిలర్ పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్