మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ కు గుండెపోటు వచ్చిందని, దీంతో మొదట ఆయనను ఆదిలాబాద్ లోని ఒక ఆసుపత్రికి తరలించామని ఆయన సన్నిహితులు తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు రమేష్ రాథోడ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వైద్యుల నుండి వివరాలను తెలుసుకున్నారు. మెరువైన చికిత్స నిమిత్తం రమేష్ రాథోడ్ని హైదరాబాద్కు తరలించారు.