రమేష్ రాథోడ్ మృతి చాలా బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. గురువారం ఉట్నూరు పట్టణంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయరంగంలో రమేష్ రాథోడ్ సీనియర్ నాయకులుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆయన మృతి ప్రజలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.