పోన్కల్ లో రేపు రెవెన్యూ సదస్సు

58చూసినవారు
పోన్కల్ లో రేపు రెవెన్యూ సదస్సు
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో భూ భారతి రెవెన్యూ సదస్సును నిర్వహించనున్నామని ఈవో రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9.30 గంటలకు పంచాయతీ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ అధికారులతో సదస్సు ఉంటుందన్నారు. ఇందులో భూ సమస్యలు ఉన్నవారు అధికారులకు అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని పోన్కల్ గ్రామంలోని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్