రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలి

71చూసినవారు
రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలి
ఆశా వర్కర్లకు ప్రభుత్వం రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ కోరారు. బుధవారం జన్నారం మండలంలోని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు రూ. 26 వేల కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్