రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల వద్ద రెన్యువల్ చేయించుకోవాలని జన్నారం క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య కోరారు. శుక్రవారం పోన్కల్ గ్రామ శివారులో ఉన్న పొలాల వద్ద రైతులను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు రుణమాఫీ అయిన రైతులు బ్యాంకులకు వెళ్లి రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు వేసిన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, తదితరులు ఉన్నారు.