ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు మేలు కోసం చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. గురువారం సాయంత్రం వారు మాట్లాడుతూ ఖానాపూర్ ఖానాపూర్ నియోజకవర్గం పూర్తిగా కవ్వాల్ అభయారణ్య పరిధిలో ఉండటంతో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుపడదన్నారు. అయితే స్థానిక వనరుల ఆధారంగా చిన్న పరిశ్రమలైన అగ్రికల్చర్, తదితర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని వారు కోరారు.