మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో జన్నారం మండలంతో పాటు పలు గ్రామాల నుండి ప్రజలు, భక్తులు భారీగా తరలివచ్చి దేవాలయంలోని మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో వారు వంటలు చేసుకుని వనభోజనాలు చేస్తున్నారు. దీంతో దేవాలయం పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్