నిలిచిపోయిన రాకపోకలు

62చూసినవారు
నిలిచిపోయిన రాకపోకలు
జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం జన్నారం మండలంలో అతి భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలో రాత్రి మహమ్మదాబాద్ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు పడిపోయింది. దీంతో జన్నారం- మంచిర్యాల మార్గంలో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్