సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం మండల ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాకపోవచ్చని, దాన్ని షేర్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఒకరిని కించపరిచే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని ఆమె సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.