విద్యార్థులకు ప్యాడులు, పెన్నులు అందజేత

69చూసినవారు
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పి పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు టైగర్ గ్రూప్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడులు, పెన్నులను అందజేశారు. శుక్రవారం సాయంత్రం టైగర్ గ్రూప్ జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడులు పెన్నులను అందించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని అధ్యక్షులు ఆర్యన్ మహారాజ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్