చొప్పదండి ఎమ్మెల్యేను కలిసిన సుగుణ

79చూసినవారు
చొప్పదండి ఎమ్మెల్యేను కలిసిన సుగుణ
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ కలిశారు. ఇటీవల సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి ఆమె వెళ్లి ఎమ్మెల్యే సత్యం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సుగుణ భర్త భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్