క్లోరినేషన్ చేయించి నీటిని సరఫరా చేయాలి

51చూసినవారు
క్లోరినేషన్ చేయించి నీటిని సరఫరా చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి బావులలో నీటిమట్టం పెరిగింది. చాలా గ్రామాలలో ప్రజలకు బావుల ద్వారానే మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆ బావులలో కొత్త నీరు రావడంతో తాగేందుకు పనికి రావడం లేదని ప్రజలు వాపోయారు. ఆ నీటిని తాగిన వారు డయేరియా, తదితర వ్యాధులతో బాధపడుతున్నారని, మంచినీటి బావులను క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్