అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల ఎత్తు, బరువుల వివరాలను అంగన్వాడీ టీచర్లు రికార్డులలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఖానాపూర్ మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అలాగే పలువురు గర్భిణీలు, బాలింతలకు కలిసి పౌష్టికాహార ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు.