చెరువుగా మారిన రోడ్డు

82చూసినవారు
చెరువుగా మారిన రోడ్డు
జన్నారం పట్టణం నుండి కవ్వాల్ కు వెళ్లే రోడ్డు వరద నీటితో చెరువును తలపిస్తోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించేందుకు ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన్నారం పట్టణ నుండి కవ్వాల్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై చాలా చోట్ల వరద నీరు నిలిచింది. ఆ రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వరద నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డుకు మరమ్మతులు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్