ఖానాపూర్ మండలంలోని దిల్వర్పూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ గుడిలో రాత్రి దొంగలు పడి దోచుకెళ్లారనీ ప్రజలు తెలిపారు. వారి కథనం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి అమ్మవారి దేవాలయంలో ప్రవేశించి అమ్మవారి వెండికిరటం, 2 మంగళసూత్రలు, బొట్టు బిల్లలు, హుండీని పగులగొట్టి నగదును దొంగలించారని, వాటి విలువ రూ. మూడు లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ మేరకు ఖానాపూర్ మండల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.