ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. నియోజకవర్గంలోని జన్నారం, తదితర మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం గంట పాటు అతి భారీ వర్షం పడింది. కడెం, ఉట్నూర్ మండలాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాబోయే 4 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఒకటి రెండు మండలాలు అతి భారీ వర్షం పడవచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారన్నారు.