ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలి

72చూసినవారు
ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలి
ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితమని ఉట్నూర్ డిపో మేనేజర్ కల్పన అన్నారు. శనివారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని ఎక్స్ రోడ్డు వద్ద ప్రయాణికులకు ఆర్టీసీ అందిస్తున్న సేవలు అవగాహన కల్పించారు. ప్రజల మేలుకోసమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయన్నారు, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని డిఎం కల్పన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు శ్రీకర్, కృష్ణ, పలువురు ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్