మాజీ జెడ్పిటిసికి సన్మానం

79చూసినవారు
మాజీ జెడ్పిటిసికి సన్మానం
జన్నారం మండల అభివృద్ధిలో మాజీ జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ కీలకపాత్ర పోషించారని విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ అన్నారు. ఎర్రచంద్రశేఖర్ జెడ్పిటిసిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బుధవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలో చంద్రశేఖర్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శ్రీరాముల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్