సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని TMHD రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండుకూరి రాజు అన్నారు. జన్నారం మండల కేంద్రంలో ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో TMHD జిల్లా నాయకులు లింగంపెల్లి రాజలింగం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.