టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు టిపిసిసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కూడా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ గెలుపు దిశగా కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.