ఈదురు గాలులు, భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ గ్రామంలో రాత్రి అకాల వర్షానికి నర్సయ్య ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. దీంతో ఆ ఇంటిని కాంగ్రెస్ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యుమ్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవత్ రావ్, తదితరులు పాల్గొన్నారు.