వెల్గానూర్: నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టాలి

83చూసినవారు
వెల్గానూర్: నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేలా నిర్వాహకులు చూడాలని వెల్గనూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి సూచించారు. మంగళవారం వెల్గానూర్ ఉన్నత పాఠశాలలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, భోజన నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ పాఠశాలలో రుచికరమైన భోజనం అందిస్తేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోగలుగుతారని, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్