రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, పెంబి మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.