ఉట్నూర్ డిపోకు పూర్వ వైభవం వచ్చేనా?

74చూసినవారు
ఉట్నూర్ డిపోకు పూర్వ వైభవం వచ్చేనా?
ఉట్నూర్ పట్టణంలో ఉన్న ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరారు. ఏజెన్సీ ప్రాంతానికి ఉట్నూర్ ఆర్టీసీ డిపో ఒకప్పుడు గుండెకాయగా ఉండేది. పదుల సంఖ్యలో బస్సులు, కార్మికులతో నిత్యం ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు అందించింది. అయితే వివిధ కారణాలతో డిపోలో బస్సులను, కార్మికులను తగ్గించడంతో చాలా గ్రామాలకు రవాణా సేవలు నిలిచిపోయాయి. డిపోకు పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్