ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కు వారు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు.