జన్నారం మండలంలోని బంగారు తండా గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆ గ్రామ యువకులు బ్లీచింగ్ పౌడర్ చల్లి మంచి మనసును చాటుకున్నారు. మండలంలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో బంగారు తండా గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ఆ గ్రామ యూత్ అధ్యక్షులు సదా సింగ్ ఆధ్వర్యంలో యువకులు గ్రామంలోని ప్రతి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.