బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్ పర్సన్ శోభా సత్య నారాయణ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక కుంకుమఅర్చన పూజలు నిర్వహించారు. తమ మనమడు హరీష్ గౌడ్ కు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.