ముధోల్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న గంగన్న బదిలీల్లో భాగంగా మండలంలోని భోరిగాం గ్రామ పాఠశాలకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామస్తులు, విద్యార్తులు బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఎందరో బీద విద్యార్థులకు చేయూతనందిస్తూ పాఠశాల అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని ఆయన చేసిన సేవలను గ్రామస్తులు కొనియాడారు.