ముథోల్ మండల కేంద్రంలో సాహితి సామ్రాట్ అన్నబావు సాటే 104వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్నబావు ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త అని ఆయన రచించిన రచనలు దేశ విదేశాల్లో మంచి ప్రజా ఆదరణ పొందాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నబావు సాటే యువజన సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.