నూతన చట్టాలపై అవగాహన

72చూసినవారు
లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో గురువారం లోకేశ్వరం పోలీసు స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సక్రియ నాయక్ గ్రామస్థులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. తప్పులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ దిగంబర్, సిబ్బంది శ్రీనివాస్, రాజు, రాజుర మాజీ సర్పంచ్ ముత్తగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్