బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్‌డి ప్రొఫెసర్ మురళీధర్షన్ తో కలిసి సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మహిళా విద్య, సామాజిక సంస్కరణలకు సావిత్రీబాయి ఫూలే చేసిన విశేష కృషిని వివరించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఆమె వారసత్వ ప్రాముఖ్యతను తెలిపారు.