నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరమని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. మంగళవారం బాసర గ్రామానికి చెందిన మేఘన అనే లబ్ధిదారురాలికి సుమారు రూ. 60 వేల సీఎం సహాయనిది చెక్కును అందజేశారు. కార్యక్రమంలో భైంసా మాజీ జెడ్పిటిసి సూర్యం రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మణరావు, సుధాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రామేశ్వరరావు, సంజీవరెడ్డి తదితరులున్నారు.